Ambati Rambabu: కులోన్మాదంతో దాడి చేయాలనుకుంటున్నారా... అయితే నాకూ ఓ కులం ఉంది: అంబటి రాంబాబు

Ambati Rambabu warns lokesh

  • నిన్న ఖమ్మంలో అంబటి రాంబాబుకు నిరసన సెగ
  • అంబటి రాంబాబు ఎదుట బిగ్గరగా నినాదాలు చేసిన టీడీపీ మద్దతుదారులు
  • నారా లోకేశ్ ను ఉద్దేశించి నేడు ట్వీట్ చేసిన అంబటి రాంబాబు

ఏపీ మంత్రి అంబటి రాంబాబు నిన్న ఖమ్మంలో ఊహించని రీతిలో నిరసనలు ఎదుర్కోవడం తెలిసిందే. ఓ కార్యక్రమం కోసం ఖమ్మం వెళ్లిన ఆయన హోటల్ లో అల్పాహారం చేసేందుకు వెళ్లగా, టీడీపీ మద్దతుదారులు "గో బ్యాక్" అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దాంతో, పోలీసులు ఆయనకు రక్షణ కల్పించి అక్కడ్నించి పంపించారు. ఆయన హోటల్ బయటికి వచ్చి కారులో ఎక్కుతున్న సమయంలో టీడీపీ మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. 

తాజాగా మంత్రి అంబటి రాంబాబు టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. "కులోన్మాదంతో దాడి చేయాలనుకుంటే నాకూ ఓ కులం ఉంది... గుర్తుపెట్టుకోండి" అంటూ హెచ్చరించారు.

Ambati Rambabu
Nara Lokesh
Caste
Khammam
YSRCP
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News