: దినేశ్ కార్తీక్ కు గవాస్కర్ మద్దతు
చాంపియన్స్ ట్రోఫీ సన్నాహక మ్యాచ్ లలో తన బ్యాట్ పవర్ తో భారత్ ను రెండుసార్లు ఆదుకున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్ ను తుదిజట్టులోకి ఎంపిక చేయాలంటున్నాడు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో టీమిండియా టాపార్డర్ తడబాటుకు గురైన రెండు సందర్భాల్లోనూ దినేశ్ శతకాలతో ఆదుకున్నాడని, అతన్ని దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు విస్మరించరాదని జట్టు యాజమాన్యానికి సూచించాడు. లోయర్ ఆర్డర్ లో అతనెంతో ఉపయుక్తమని, దినేశ్ ఎంపికతో జట్టుకు సమతూకం తెస్తుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.