Stock Market: భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
- 900 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 264 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా పతనమైన ఎం అండ్ ఎం షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. భారీ నష్టాలతో ఈ ఉదయం ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు ఆ తర్వాత కోలుకోలేదు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలే దీనికి కారణం. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పతనమై 63,148కి దిగజారింది. నిఫ్టీ 264 పాయింట్లు కోల్పోయి 18,857కి పడిపోయింది.
యాక్సిస్ బ్యాంక్ (1.74%), ఐటీసీ (0.35%), హెచ్సీఎల్ (0.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.10%).
మహీంద్రా అండ్ మహీంద్రా (-4.06%), బజాజ్ ఫైనాన్స్ (-3.54%), ఏసియన్ పెయింట్స్ (-3.36%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.16%), నెస్లే ఇండియా (-2.81%).