Amala Paul: రెండో వివాహం చేసుకోబోతున్న అమలాపాల్

Amala Paul second marriage

  • తమిళ దర్శకుడు విజయ్ తొలి వివాహం చేసుకున్న అమలాపాల్
  • మనస్పర్థల కారణంగా 2017లో విడిపోయిన వైనం
  • ఇప్పుడు తన స్నేహితుడు జగత్ ను వివాహం చేసుకోబోతున్న మలయాళ భామ

అందాల భామ అమలాపాల్ మళ్లీ ప్రేమలో పడింది. తన స్నేహితుడు జగత్ దేశాయ్ తో ప్రేమలో ఉన్న ఆమె... జగత్ పెళ్లి ప్రపోజల్ కు ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను జగత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈరోజు అమలాపాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా వీడియోను అందరితో పంచుకున్నాడు. దీనికి వెడ్డింగ్ బెల్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మలయాళ భామ అమలాపాల్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయింది. తమిళ, మలయాళ చిత్రాల్లో సైతం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. కెరీర్ టాప్ గేర్ లో దూసుకుపోతున్న సమయంలో తమిళ దర్శకుడు విజయ్ ని వివాహం చేసుకుంది. అయితే, ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2017లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత తన స్నేహితుడు జగత్ ప్రేమలో పడింది. తాజాగా అతడితో పెళ్లికి ఓకే చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Amala Paul
Tollywood
Kollywood
Second Marriage
  • Loading...

More Telugu News