David Warner: ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్ వెల్ వ్యాఖ్యలతో విభేదించిన డేవిడ్ వార్నర్

David Warner against to Glenn Maxwell statement

  • ఢిల్లీలో నిన్న జరిగిన మ్యాచ్ లో డ్రింక్స్ బ్రేక్ లో లైటింగ్ షో
  • ఈ షోపై మ్యాక్స్ వెల్ అసంతృప్తి
  • ప్రేక్షకుల ఆనందం కోసం లైటింగ్ షో పెట్టారన్న వార్నర్

వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన లైటింగ్ షోపై ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్ మెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లైటింగ్ షో వల్ల క్రికెటర్లు ఇబ్బంది పడుతున్నారని... దీని వల్ల సడెన్ గా తలనొప్పి వస్తోందని ఆయన అన్నాడు. ఈ వ్యాఖ్యలపై ఆసీస్ మరో స్టార్ బ్యాట్స్ వెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. తాను లైటింగ్ షోను చాలా ఎంజాయ్ చేశానని చెప్పాడు. ఈ షో వల్ల గ్రౌండ్ లో ఆనందకర వాతావరణం నెలకొందని అన్నాడు. 

లైటింగ్ షోను ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేశారని, ఇది చాలా గొప్పగా ఉందని వార్నర్ తెలిపాడు. ఇది క్రికెట్ అభిమానులకు సంబంధించినది అని... ఫ్యాన్స్ కు ఇష్టంలేని పనిని తాము చేయలేమని చెప్పాడు. ఆస్ట్రేలియా టీమ్ కు మద్దతుగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలను తెలియజేస్తున్నానని అన్నాడు. 

నిన్న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో డ్రింక్స్ బ్రేక్ సమయంలో స్టేడియంలో లైటింగ్ షోను ఏర్పాటు చేశారు. దీనిపై మ్యాక్స్ వెల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ సమయంలో మ్యాక్స్ వెల్ కళ్లు మూసుకున్నాడు. ఈ కాంతి నుంచి బయటకు రావడానికి కాస్త సమయం పడుతుందని, ఈ కాంతి వల్ల తనకు తలనొప్పి వస్తుందని ఆయన చెప్పాడు. దీనిపై వార్నర్ స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News