Czech republic: హెలికాప్టర్ నుంచి నోట్ల వర్షం కురిపించిన టెలివిజన్ హోస్ట్!

Czech influencer drops 1 million dollar from helicopter

  • చెక్ రిపబ్లిక్ లో చోటు చేసుకున్న ఘటన
  • ఓ పోటీలో తేలని విజేత
  • దీంతో అభ్యర్థులందరిపై నోట్ల వర్షం
  • 4,000 మందికి రూ.కోటి రూపాయలు

హెలికాప్టర్ నుంచి కోట్లాది రూపాయలు నోట్ల రూపంలో పడుతుంటే..? కిందనున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..! చెక్ రిపబ్లిక్ లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. లైనా నాడ్ లాబెమ్ ప్రాంతంలో హెలికాప్టర్ నుంచి మిలియన్ డాలర్ల నోట్లు కుప్పలుగా కింద పడిపోయాయి. అక్కడి ప్రముఖ టెలివిజన్ హోస్ట్ కమిల్ బార్టోషెక్ ఈ చర్యకు పాల్పడ్డారు. దీని వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. నిజానికి ఓ పోటీ పెట్టి, అందులో గెలిచిన వ్యక్తికి మిలియన్ డాలర్లు ఇవ్వాలని తొలుత బార్టెషెక్ భావించారు. బార్టోహెక్ సినిమా ‘వన్ మ్యాన్ షో’లో ఉన్న అంతరార్ధాన్ని కనుక్కుని చెప్పడమే పోటీ. కానీ, దీన్ని ఎవరూ పరిష్కరించలేకపోయారు.

దీంతో బార్టెషెక్ కు మరో ఆలోచన తట్టింది. పోటీలో నమోదు చేసుకున్న వారందరికీ మిలియన్ డాలర్లను సమానంగా పంచుదామని అనుకున్నారు. మీరంతా ఫలానా ప్రాంతానికి చేరుకోవాలంటూ ఆయన మెయిల్ ద్వారా కోరారు. చెప్పిన సమయానికి, చెప్పిన ప్రదేశానికి బార్టోహెక్ హెలికాప్టర్ లో వచ్చారు. తన మెయిల్ ను నమ్మి అక్కడకు చేరుకుని వేచి చూస్తున్న వారిపై హెలికాప్టర్ నుంచే నోట్ల వర్షం కురిపించారు. దీన్ని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రపంచంలో ఇదే తొలి ధన వర్షం అంటూ ఆయన క్యాప్షన్ పెట్టేశారు. 

పై నుంచి నోట్లు పడుతుంటే కింద వేలాది మంది వాటిని సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. చేతికి దొరికిన కరెన్సీ నోట్లను వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపేసుకున్నారు. మిలియన్ డాలర్లను సుమారు 4,000 మంది సొంతం చేసుకున్నట్టు బార్టోషెక్ ప్రకటంచారు. కావాలంటే సదరు కరెన్సీని విరాళంగా ఇచ్చేందుకు వాటితోపాటు క్యూఆర్ కోడ్ ను కూడా ఉంచారు. (వీడియో కోసం)

  • Loading...

More Telugu News