Sangeeth Sobhan: జీ 5లో 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న ‘ప్రేమ విమానం’

Prema Vimanam Streaming update

  • ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న 'ప్రేమ విమానం'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
  • ఓటీటీ నుంచి అనూహ్యమైన రెస్పాన్స్
  • కీలకమైన పాత్రను పోషించిన అనసూయ


జీ 5లో ఈ నెల 13 నుంచి 'ప్రేమ విమానం' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అభిషేక్ పిక్చర్స్ వారు, జీ 5తో క‌లిసి ఈ సినిమాను నిర్మించారు. సంతోష్ కాటా ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమా, సహజత్వానికి అద్దంపడుతూ సాగుతుంది. కలలకు .. ఊహలకు మధ్య నలిగిపోయే సగటు జీవితాలను ఆవిష్కరిస్తుంది. 

 విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు .. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు .. బాధలు .. నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఈ కథ నడుస్తుంది. ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించారు. 

విడుద‌లైన కొన్నిరోజుల్లోనే ఈ సినిమా 50 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకోవ‌టం విశేషం. సంతోష్ శోభన్ .. శాన్వి మేఘన జంటగా నటించిన ఈ సినిమాలో, అనసూయ కీలకమైన పాత్రను పోషించింది. దేవాన్ష్ నామా - అనిరుధ్ నామా .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు.

Sangeeth Sobhan
Shanvi Meghana
Anasuya
Prema Vimanam
  • Loading...

More Telugu News