CPI Narayana: బీఆర్ఎస్‌పై గట్టిగా పోరాడిన బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి అన్యాయంగా తొలగించారు: సీపీఐ నారాయణ

CPI Narayana comments on Bandi Sanjay

  • బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా సహకరిస్తోందన్న నారాయణ
  • సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయినందుకు బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాయాలన్న నారాయణ
  • తెలంగాణలోనూ బీజేపీని ఓడించేందుకు పని చేస్తామని వెల్లడి

కేంద్రంలోని బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా సహకరిస్తోందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయినందుకు బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై కూడా ఆయన స్పందించారు. బీఆర్ఎస్‌పై గట్టిగా పోరాటం చేసిన సంజయ్‌ని బీజేపీ ఆ పదవి నుంచి అన్యాయంగా తొలగించిందని విమర్శించారు. రాష్ట్రంలోనూ బీజేపీని ఓడించేందుకు పని చేస్తామని స్పష్టం చేశారు.

CPI Narayana
BRS
BJP
Bandi Sanjay
Telangana Assembly Election
  • Loading...

More Telugu News