Pooja Hegde: ఈ దసరాను రేంజ్ రోవర్ కారుతో సెలబ్రేట్ చేసుకున్న పూజాహెగ్డే.. కారు ధర ఎంతో తెలుసా?

Pooja Hegde Brings Home A Swanky New Range Rover

  • టాలీవుడ్‌లో కలసిరాక బాలీవుడ్‌కు వెళ్లిన పొడవుకాళ్ల సుందరి
  • షాహిద్ కపూర్‌తో సినిమా చేస్తున్న పూజ
  • వచ్చే ఏడాది దసరాకు విడుదల
  • షాహిద్ లుక్‌ను రివీల్ చేసిన నటి

టాలీవుడ్‌లో అంతగా కలిసిరాక బాలీవుడ్‌కు వెళ్లిన పొడవు కాళ్ల సుందరి పూజాహెగ్డే దసరాను సరికొత్తగా సెలబ్రేట్ చేసుకుంది. విజయ దశమిని పురస్కరించుకుని సరికొత్త రేంజ్ రోవర్ ఎస్వీ కారుతో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యపర్చింది. బ్లూ అనార్కలీ డ్రెస్‌తో బ్రాండ్ న్యూ కారు నుంచి దిగుతూ కనిపించింది. ఈ కారు ఖరీదు అక్షరాలా నాలుగు కోట్ల రూపాయలు. ఇందులోని ఫీచర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కార్లంటే అమిత ఇష్టం ప్రదర్శించే పూజాహెగ్డే వద్ద ఇప్పటికే పోర్షే కయన్, జాగ్వార్, ఆడి క్యూ7వంటి కార్లు ఉన్నాయి. 

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌తో తాజాగా ఓ సినిమాలో నటిస్తున్న పూజ.. ఆ సినిమాలోని షాహిద్ కేరెక్టర్‌కు సంబంధించిన ఫొటోను రివీల్ చేసింది. ఈ మూవీలో షాహిద్ దేవా అనే కేరెక్టర్ చేస్తున్నాడు. చేతిలో తుపాకితో ఉన్న షాహిద్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు పూజా పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించిన పేరును మేకర్స్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు.

More Telugu News