Nara Bhuvaneswari: నేటి నుంచి భువనేశ్వరి యాత్ర.. రేపటి నుంచి వైసీపీ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదిగో!
- నేటి నుంచి 'నిజం గెలవాలి' పేరుతో భువనేశ్వరి యాత్ర
- రేపటి నుంచి 'సామాజిక సాధికారత' పేరుతో వైసీపీ బస్సు యాత్ర
- ప్రతిరోజు మూడు ప్రాంతాల్లో కొనసాగనున్న బస్సు యాత్ర
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలోని ప్రధాన పార్టీలు అనునిత్యం ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో బాధను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారిని ఈరోజు నుంచి నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. 'నిజం గెలవాలి' పేరుతో ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు, రేపటి నుంచి 'సామాజిక సాధికారత' పేరుతో వైసీపీ బస్సు యాత్రను చేపడుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది.
వైసీపీ బస్సు యాత్ర షెడ్యూల్:
అక్టోబర్ 26 – ఇచ్చాపురం, తెనాలి, శింగనమల
అక్టోబర్ 27 – గజపతినగరం, నరసాపురం, తిరుపతి
అక్టోబర్ 28 – భీమిలి, చీరాల, పొద్దుటూరు
అక్టోబర్ 30 – పాడేరు, దెందులూరు, ఉదయగిరి
అక్టోబర్ 31 – ఆముదాలవలస, నందిగామ, ఆదోని
నవంబర్ 1 – పార్వతీపురం, కొత్తపేట, కనిగిరి
నవంబర్ 2 – మాడుగుల, అవనిగడ్డ, చిత్తూరు
నవంబర్ 3 – నరసన్నపేట, కాకినాడ రూరల్, శ్రీకాళహస్తి
నవంబర్ 4 – శృంగవరపుకోట, గుంటూరు ఈస్ట్, ధర్మవరం
నవంబర్ 6 – గాజువాక, రాజమండ్రి రూరల్, మార్కాపురం
నవంబర్ 7 – రాజాం, వినుకొండ, ఆళ్లగడ్డ
నవంబర్ 8 – సాలూరు, పాలకొల్లు, నెల్లూరు రూరల్
నవంబర్ 9 – అనకాపల్లి, పామర్రు, తంబళ్లపల్లె.