Telangana: రామగుండం జెన్‌కో విద్యుత్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

Fire incident at Ramagundam Genco Power Plant

  • బీ-పవర్ హౌజ్‌లో షార్ట్ సర్క్యూట్
  • సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘటన
  • ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

తెలంగాణలో మరో ప్రమాదం వెలుగుచూసింది. కేబుల్ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా రామగుండం 62 మెగా వాట్ల బీ- పవర్ హౌజ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కొంతమేర ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు భారీగా మంటలు ఎగసిపడుతున్న కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు వెంటనే స్పందించారు. మంటలు ఆర్పివేశారు. అయితే ఈ అగ్నిప్రమాదాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి రావడమే ఇందుకు కారణంగా ఉంది. ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News