KTR: జగనన్న పేరు చెప్పారని ట్రోల్ చేశారు... ఆంధ్రా రాజకీయం వేరు అనుకోండి: కేటీఆర్

Minister KTR talks about AP politics

  • మినిస్టర్ కేటీఆర్ విత్ జయప్రకాశ్ ప్రోగ్రాంలో మంత్రి కేటీఆర్
  • హన్మకొండతో పాటు నెల్లూరు, భీమవరంలలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని చెబితే ట్రోల్ చేశారన్న కేటీఆర్
  • తాను మంచి ఉద్దేశ్యంతో చెప్పినప్పటికీ ట్రోల్ చేశారన్న మంత్రి

తాను జగనన్న పేరు చెప్పానని తనను తీవ్రంగా ట్రోల్ చేశారని మంత్రి కేటీ రామారావు అన్నారు. టీవీ9లో 'మినిస్టర్ కేటీఆర్ విత్ జయప్రకాశ్' కార్యక్రమంలో ఆయన తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పారు. కొన్ని రోజుల క్రితం హన్మకొండలోని మడికొండ ఐటీ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నారైలు తెలంగాణతో పాటు ఏపీలోని నెల్లూరు, భీమవరంలోను ఐటీ సంస్థలపై పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఈ వ్యాఖ్యలకు గాను తనపై ట్రోలింగ్ జరిగినట్లు కేటీఆర్ ఈ రోజు వెల్లడించారు.

హన్మకొండలో పెట్టినందుకు సంతోషమని, కానీ అన్ని ద్వితీయశ్రేణి నగరాల్లోను ఐటీ సంస్థలు పెట్టాలని తాను సూచించానని, దీనిపై తనను ట్రోల్ చేశారన్నారు. నెల్లూరులో, భీమవరంలో కూడా పెట్టాలని, పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టాలని తాను చెప్పానని, అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏపీలో పెడతానంటే జగనన్నకు చెప్పి ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పానని దీంతో తనను ట్రోల్ చేశారన్నారు. 'సర్లెండి.. అది ఆంధ్రా రాజకీయం వేరు అనుకోండి... అప్పుడప్పుడు అలా జరిగిపోతుంది' అన్నారు. తాను మంచి ఉద్దేశ్యంతో అలా చెప్పాన్నారు.

KTR
Jayaprakash Narayan
Telangana
YS Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News