Adikeshava: 'ఆదికేశవ' నుంచి జోరుగా సాగే హుషారైన బీట్!

Adi Keshava Movie Update

  • 'ఆదికేశవ'గా కనిపించనున్న వైష్ణవ్ తేజ్ 
  • ఆయన జోడీకట్టిన శ్రీలీల
  • సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాశ్ కుమార్ 
  • నవంబర్ 10వ తేదీన సినిమా విడుదల

వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఆదికేశవ' సినిమా రూపొందింది. పవర్ఫుల్ కంటెంట్ తో .. ఎక్కువ యాక్షన్ పాళ్లతో ఆయన చేసిన సినిమా ఇది. నాగవంశీ - సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించాడు. వైష్ణవ్ తేజ్ జోడీగా శ్రీలీల నటించిన ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం థర్డ్ సింగిల్ కి సంబంధించిన ప్రోమోను వదిలారు. హీరో .. హీరోయిన్ పై చిత్రీకరించిన ఈ డ్యూయెట్ 'లీలమ్మో' అంటూ సాగుతుంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో జోరుగా హుషారుగా సాగే పాట ఇది. ఈ నెల 25వ తేదీన పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు. జోజు జార్జ్ .. అపర్ణ దాస్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. ఒక క్వారీ తవ్వకాలకు అడ్డుగా ఉందనే ఉద్దేశంతో ప్రాచీన కాలంనాటి శివాలయాన్ని పడగొట్టడానికి ఒక బిజినెస్ మెన్ ట్రై చేస్తాడు. అందుకు అడ్డుపడిన ఆదికేశవకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ. నవంబర్ 10వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

Adikeshava
Vaishnav Tej
Sreeleela
GV Prakash Kumar

More Telugu News