Chiranjeevi: సెలబ్రేషన్ సాంగ్ తో 156వ సినిమాను మొదలెట్టిన మెగాస్టార్!

- సెట్స్ పైకి వెళ్లిన మెగాస్టార్ 156వ సినిమా
- ఫాంటసీ కంటెంట్ ను రెడీ చేసిన వశిష్ఠ
- కీరవాణి సాంగ్ రికార్డింగ్ తో పూజా కార్యక్రమాలు మొదలు
- యూవీ బ్యానర్ కి ఇది 14వ సినిమా
యూవీ క్రియేషన్స్ వారి బ్యానర్లో శ్రీవశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారనీ, ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా, ఈ విజయదశమి వేళ కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
గతంలో మాదిరిగా సాంగ్ రికార్డింగ్ తో ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలుకావడం విశేషం. ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయనీ, ఒక బలమైన కథను వశిష్ఠ భుజాన వేసుకుని వస్తున్నాడని కీరవాణి అన్నారు. ఇలాంటి ఒక ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వంగా ఉందని గేయ రచయిత చంద్రబోస్ అన్నారు.
