Rakshith: కొన్నిసార్లు దేవుడు కూడా రాక్షసుడుగా మారతాడు: 'నరకాసుర' ట్రైలర్ డైలాగ్

Narakasura Trailer released

  • రక్షిత్ అట్లూరి హీరోగా 'నరకాసుర'
  • విలేజ్ నేపథ్యంలో నడిచే కథ
  • కథానాయికగా అపర్ణ జనార్దన్ పరిచయం  
  • నవంబర్ 3వ తేదీన సినిమా రిలీజ్

'పలాస' సినిమాతో పాప్యులర్ అయిన రక్షిత్ అట్లూరి హీరోగా, 'నరకాసుర' సినిమా రూపొందింది. శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకి, సెబాస్టియన్ దర్శకత్వం వహించాడు. నౌఫల్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా అపర్ణ జనార్దన్ కనిపించనుంది. 

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ ... ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 'నువ్వు నిర్మించుకు ఈ ప్రపంచంలో అంతా నీ వాళ్లే. బయట ప్రపంచానికి మాత్రం నువ్వు అనాథవే. కొన్ని సార్లు దేవుళ్లు కూడా రాక్షసులుగా మారాల్సి వస్తుంది' అనే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 

ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. అడవికి సమీపంలోని ఒక విలేజ్ నేపథ్యంలో ఈ కథ నడవనున్నట్టుగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. నవంబర్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. థియేటర్ల నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి. 

More Telugu News