Thummala: తెలంగాణ, ఏపీ రాజకీయాలపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

Thummala comments on Telangana and AP politics
  • రెండు రాష్ట్రాల్లో అరాచకపాలన కొనసాగుతోందన్న తుమ్మల
  • ఇలాంటి అవినీతి, నిర్బంధ పాలనను చూడలేదని విమర్శ
  • బెదిరించి, అదిరించి ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరని వ్యాఖ్య
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో దారుణమైన రాజకీయాలు నడుస్తున్నాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. ఇలాంటి అవినీతి, నిర్బంధ పాలన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ప్రతీకారాలకు పాల్పడలేదని చెప్పారు. ప్రతిపక్షాలను, ప్రజలను బెదిరించి, అదిరించి ఎల్లకాలం రాజకీయాలు చేయలేరని అన్నారు. తెలంగాణలో సుస్థిరమైన పాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని చెప్పారు. ఖమ్మం 14వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ తుమ్మల పైవ్యాఖ్యలు చేశారు.  
Thummala
Congress

More Telugu News