Andhra Pradesh: నేడు నిజరూప అలంకరణలో భక్తులకు భ్రమరాంబికాదేవి దర్శనం
- నేటితో శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు
- సాయంత్రం నిజరూప అలంకారంలో అమ్మవారి దర్శనం
- తెప్పోత్సవంతో ఉత్సవాల ముగింపు
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాలు, వేడుకలు చివరి దశకు వచ్చాయి. శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు చివరిరోజుకు చేరుకున్నాయి. విజయదశమి సందర్భంగా భక్తులకు భ్రమరాంబికాదేవి దర్శనమివ్వనున్నారు.
మంగళవారం సాయంత్రం నిజరూప అలంకారంలో భ్రమరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనభాగ్యం ఇవ్వనున్నారు. స్వామి అమ్మవార్లు నందివాహనంపై ఆసీనులై విశేష పూజాసేవలు అందుకోనున్నారు. నందివాహనంపై శ్రీ స్వామి అమ్మవారికి ఆలయ ప్రకరోత్సవం, జమ్మివృక్షం వద్ద శమీపూజలు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి నిర్వహించనున్న శ్రీస్వామి అమ్మవార్ల తెప్పోత్సవం వేడుకతో విజయదశమి ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.