Cricket: పాక్‌పై ఆఫ్ఘన్ విజయం తర్వాత గ్రౌండ్‌లోనే ఉన్న ఇర్ఫాన్ పఠాన్ ఏం చేశాడో మీరే చూడండి..

Irfan Pathan celebrates with Rashid Khan after Afghanistan historic win vs Pakistan

  • రషీద్ ఖాన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన ఇర్ఫాన్
  • అద్భుతంగా ఆడారంటూ ప్రశంస
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఇర్ఫాన్ వీడియో

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో సోమవారం రాత్రి మరో సంచలనం నమోదయ్యింది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను కంగుతినిపించిన ఆఫ్ఘనిస్థాన్ తాజాగా పాకిస్థాన్‌‌ను కూడా మట్టికరిపించింది. పాక్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘన్ బ్యాటర్లు అలవోకగా ఛేదించి అబ్బురపరిచారు. వరల్డ్ కప్‌లో ఈ ఘనవిజయంతో చరిత్ర సృష్టించారు. ఈ విజయాన్ని ఆఫ్ఘనిస్థాన్ అభిమానులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌ అందరినీ అలరించింది. ఆఫ్ఘన్ ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించిన తీరు చూసి మాజీ క్రికెటర్లే ప్రశంసిస్తున్నారు. ఇక స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా అదే గ్రౌండ్‌లో ఉన్న భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆశ్చర్యపోవడమే కాదు.. ఆప్ఘన్ విజయాన్ని చిన్నపాటి సెలబ్రేషన్ కూడా చేసుకున్నాడు.

గెలుపు అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ గ్రౌండ్‌లో కలియతిరిగిన ఆఫ్ఘన్ ఆటగాళ్లను ఇర్ఫాన్ పఠాన్ అభినందించాడు. రషీద్ ఖాన్‌తో కలిసి మైదానంలోనే డ్యాన్స్ చేశాడు. ఆ వెంటనే రషీద్‌ను ఆలింగనం చేసుకొని మెచ్చుకున్నాడు. అద్భుతంగా ఆడారంటూ ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లతో సంభాషించాడు. పలువురితో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి.

More Telugu News