Yuvraj Singh: కోహ్లీ, నువ్వే తోపు: యువరాజ్ సింగ్

Yuvraj Singh says Kohli is GOAT

  • న్యూజిలాండ్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ
  • తీవ్ర ఒత్తిడిలో కూడా ఆటను చివరి వరకు తీసుకెళ్లాడని కొనియాడిన యువీ
  • అందుకే కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని కితాబు

నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఇద్దరు ఓపెనర్లు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ కు చేరినా.... విరాట్ కోహ్లీ తన అద్భుత బ్యాటింగ్ తో భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. 95 పరుగులు చేసిన కోహ్లీ మ్యాచ్ చివర్లో ఔటయ్యాడు. దీనిపై మాజీ బ్యాటింగ్ దిగ్గజం యువరాజ్ సింగ్ స్పందిస్తూ కోహ్లీపై ప్రశంసలు వర్షం కురిపించాడు. కోహ్లీ సెంచరీ చేయలేకపోయినా... దానికన్నా ఇది అత్యంత విలువైన ఇన్నింగ్స్ అని చెప్పాడు. కోహ్లీ నుంచి మరో అద్భుతమైన ఆటను ఆస్వాదించామని తెలిపాడు. తీవ్ర ఒత్తిడిని సైతం అధిగమించి అద్భుత ఆటతీరును ప్రదర్శించాడని చెప్పాడు. చివరి వరకు మ్యాచ్ ను తీసుకెళ్లడం గ్రేట్ అని కొనియాడాడు. అందుకే కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పాడు.

Yuvraj Singh
Virat Kohli
Team India
  • Loading...

More Telugu News