Anasuya: బాలకృష్ణ సార్ చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను: అనసూయ

Balakrishna sir words I will not forget forever says Anasuya
  • భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తున్న బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ
  • అమ్మాయిలకు బ్యాడ్ టచ్ గురించి చెప్పే సన్నివేశం హైలైట్
  • ఒక మంచి సందేశం వారం రోజుల్లోనే అందరికీ చేరిందన్న రాహుల్ రవీంద్రన్
నటసిహం బాలకృష్ణ వరుస హిట్లతో టాలీవుడ్ లో జోష్ నింపుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల తర్వాత భగవంత్ కేసరితో మరోసారి బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల, హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించారు. ఇప్పటికే రూ. 65 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. 

ఈ చిత్రంలో అమ్మాయిలకు బాలయ్య చెప్పే సూచనలు సినిమా చూస్తున్న వారిని కాసేపు షాక్ కు గురి చేస్తాయి. ఏమీ తెలియని చిన్నారుల శరీర భాగాలను కామాంధులు ఎక్కడెక్కడ టచ్ చేస్తారు... అప్పుడు వెంటనే ఏం చేయాలి అనే విషయాన్ని అమ్మాయిలకు వివరిస్తారు. బాలయ్య చెప్పే ఈ మాటలతో సినిమాను వీక్షిస్తున్న ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతారు. 

ఈ డైలాగులపై దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలను చైతన్యవంతులను చేయడం భగవంత్ కేసరి చిత్రం ద్వారా కేవలం వారం రోజల్లోనే సాధ్యమయిందని... ఇతర మీడియా ద్వారా ఈ పని చేయాలంటే పదేళ్లు పడుతుందని అన్నారు. సినిమా ద్వారా దీన్ని సాధ్యం చేసిన బాలకృష్ణ గారికి, అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. 

ఈ ట్వీట్ కు నటి అనసూయ రీట్వీట్ చేసింది. ఇది వాస్తవమని... బాలకృష్ణ సార్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంటాయని తెలిపింది.
Anasuya
Balakrishna
Tollywood
Bhagavanth Kesari

More Telugu News