Shankar Dada MBBS: మళ్లీ వస్తున్న 'శంకర్ దాదా ఎంబీబీఎస్'

Chiranjeevi starred Shankar Dada MBBS set to re release

  • చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన శంకర్ దాదా ఎంబీబీఎస్
  • నవంబరు 4న రీ రిలీజ్
  • మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం 

ఇటీవల పాత చిత్రాలు మళ్లీ విడుదలవుతున్న ట్రెండ్ నడుస్తోంది. డాల్బీ అట్మోస్, 4కే వంటి ఆధునిక హంగులతో పాత చిత్రాలను ముస్తాబు చేసి రీ రిలీజ్ చేస్తున్నారు. గతంలో ఆడిన సినిమాలే అయినప్పటికీ, వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. 

ఈ కోవలోనే, మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం 'శంకర్ దాదా ఎంబీబీఎస్' కూడా రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శంకర్ దాదా... చిత్రాన్ని 4కే అల్ట్రా హెచ్ డీ, డాల్బీ సరౌండ్ 7.1 ఫీచర్లతో సరికొత్తగా తీర్చిదిద్దారు.

 2004లో వచ్చిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఓ దశలో హిట్లు కరవైన స్థితిలో ఈ సినిమాతో చిరంజీవి తన స్టామినా చాటుకున్నారు. హిందీలో హిట్టయిన 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' కు రీమేక్ అయినప్పటికీ, చిరంజీవి ట్రేడ్ మార్కు నటనతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. 

అక్కినేని రవిశంకర్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' చిత్రానికి జయంత్ సి పరాన్జీ దర్శకుడు. బాలీవుడ్ భామ సోనాలీ బెంద్రే ఇందులో చిరు సరసన కథానాయికగా నటించింది. పరేశ్ రావల్, శ్రీకాంత్, శర్వానంద్, పంజా వైష్ణవ్ తేజ్ (బాలనటుడిగా) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఉర్రూతలూగించాయి.

Shankar Dada MBBS
Re Release
Chiranjeevi
Megastar
Tollywood
  • Loading...

More Telugu News