Deepika Padukone: ఈ ఒక్క హీరోతోనే నా వ్యక్తిగత విషయాలను కూడా చర్చిస్తా: దీపికా పదుకొణే

Deepika Padukone about Shahrukh Khan

  • నలుగురిలోకి వెళ్తే ముడుచుకుపోతానన్న దీపిక
  • సినిమా విషయాలను తన భర్తతోనే పంచుకుంటానని వెల్లడి
  • షారుక్ తో వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడతానన్న దీపిక  

బాలీవుడ్ లో దీపికా పదుకొణే వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఆమె సినిమాలో ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. ఆమె కాల్షీట్ల కోసం దర్శకులు, నిర్మాతలు ఎన్ని రోజులైనా వేచి చూస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను జన్మతః క్రీడాకారిణిని అని... అందుకే ఓటమిని కూడా ఒక క్రీడాకారిణిలా హుందాగా స్వీకరిస్తానని చెప్పారు. తనకంటే గొప్పగా నటించే వాళ్లు చాలా మంది ఉండొచ్చని... కానీ, క్రమశిక్షణలో తన తర్వాతే ఎవరైనా అని అన్నారు.   

స్వతహాగా తాను అంతర్ముఖురాలినని... నలుగురిలోకి వెళ్లాలంటే ముడుచుకుపోతానని దీపిక తెలిపింది. తన ప్రపంచంలో ఒకరో, ఇద్దరో ఉంటారని చెప్పారు. ఇంట్లో షూటింగ్ విషయాలను మాట్లాడనని... అలాగే, కుటుంబ విషయాల గురించి సెట్స్ లో మాట్లాడనని తెలిపారు. సినిమా విషయాలను కేవలం తన భర్త రణవీర్ తో మాత్రమే షేర్ చేసుకుంటానని చెప్పారు. మనసు విప్పి తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకునేంత చనువు బాలీవుడ్ లో కేవలం షారుక్ ఖాన్ తో మాత్రమే ఉందని అన్నారు. తన గురించి వచ్చే ట్రోలింగ్స్ ను అస్సలు పట్టించుకోనని చెప్పారు.

Deepika Padukone
Ranvir Singh
Shahrukh Khan
Bollywood
  • Loading...

More Telugu News