Nani: నాని కొత్త చిత్రం టైటిల్ ఇదే... గ్లింప్స్ మామూలుగా లేదు!

Nani new movie title announced

  • డీవీవీ బ్యానర్లో నాని కొత్త ప్రాజెక్టు 'సరిపోదా శనివారం'
  • వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ మూవీ
  • నాని సరసన కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్
  • కీలకపాత్రలో ఎస్ జే సూర్య

దసరా సందర్భంగా నేచురల్ స్టార్ నాని కొత్తం చిత్రం టైటిల్ ను విడుదల చేశారు. ఈ చిత్రం పేరు 'సరిపోదా శనివారం'. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకుడు. నాని కెరీర్ లో ఇది 31వ చిత్రం. 'సరిపోదా శనివారం' చిత్రంలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఎస్ జే సూర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. 

ఇవాళ టైటిల్ తో పాటు గ్లింప్స్ వీడియోను కూడా చిత్రబృందం పంచుకుంది. ఈ వీడియో చూస్తే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న పక్కా యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది.

Nani
Saripoda Sanivaaram
New Movie
Nani31
Vivek Atreya
DVV Entertainment

More Telugu News