Pooja: అందుకే 'బిగ్ బాస్ హౌస్' నుంచి బయటికి రావలసి వచ్చింది: పూజ

Bigg Boss 7 Update

  • 'బిగ్ బాస్ హౌస్' నుంచి పూజ అవుట్ 
  • శోభ ఓటమిని కూడా స్వీకరించాలని వ్యాఖ్య 
  • యావర్ కోపం తగ్గిందని వెల్లడి 
  • హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రతిక

'బిగ్ బాస్' హౌస్ లో నుంచి నిన్న 'పూజ' బయటికి వచ్చేసింది. వైల్డ్ కార్డు ద్వారా పూజ ఎంట్రీ ఇచ్చి రెండు వారాలు అవుతోంది. మొదటి నుంచి కూడా పూజ పరిపక్వత కనబరుచుతూ వచ్చింది. తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా .. స్పష్టంగా చెప్పడం పూజ ప్రత్యేకత. నిన్న హౌస్ లో నుంచి వెళుతూ ఆమె ఎమోషనల్ అయింది. 

అప్పుడప్పుడు ఓటమి ఎదురవుతూ ఉంటుందనీ, ఓటమిని కూడా స్వీకరించాలని ఆమె స్టేజ్ పై నుంచి శోభతో చెప్పింది. ఇక 'యావర్' కి కోపం చాలా ఉండేదనీ, అయితే ఇప్పుడు చాలా తగ్గిందని ఆమె అంది. దెబ్బలు తగిలించుకోకుండా ఆడమని చెప్పింది. తాను ఛాన్స్ తీసుకుని ఆడకపోవడం వల్లనే హౌస్ నుంచి బయటికి కనబరుస్తూ రావడం జరిగిందని ఆమె భోలాతో అంది. 

ఇక ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటికి వెళ్లినవారిలో నుంచి ఒకరిని ఇంట్లోకి తిరిగి తీసుకురావడం కోసం, హౌస్ సభ్యులకు ఓటింగ్ నిర్వహించారు. 'ఉల్టా పుల్టా'లో భాగంగా జరిగిన ఓటింగ్ ప్రకారం, 'రతిక' రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తనకి వచ్చిన ఈ ఛాన్స్ ను ఆమె ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.

More Telugu News