Puvvada Ajay Kumar: పువ్వాడ అజయ్‌ని ఖాసీం రజ్వీతో పోల్చిన మాజీ మంత్రి తుమ్మల

Thummala fires at Puvvada Ajay Kumar

  • నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో మైనార్టీలు అండగా ఉన్నారన్న తుమ్మల
  • నేను మంత్రిగా ఉండగా ప్రజలు అభివృద్ధి కావాలనే వారు.. ఇప్పుడు కబ్జాలు జరుగుతున్నాయని చెబుతున్నారన్న తుమ్మల
  • అధికార అండతో తప్పుడు కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శ

మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఖమ్మంలో జరిగిన మైనార్టీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ... తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో మైనార్టీలు ఎప్పుడూ తనకు అండగా ఉన్నారన్నారు. వారి సంక్షేమం కోసం తాను కృషి చేశానన్నారు. అరాచక, అవినీతిలేని ప్రశాంతమైన వాతావరణం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్‌ను ఖాసీం రజ్వీతో పోల్చారు.

తాను మంత్రిగా ఉన్న సమయంలో జనాలు అభివృద్ధి కావాలని అడిగేవారని, కానీ ఇప్పుడు ప్రజలు తమ భూములు కబ్జా అయినట్లు చెబుతున్నారన్నారు. అధికారం ఉన్నవారి వైపు పోలీసులు ఉన్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. మంచి చేయాల్సిన మంత్రి అజయ్ కుమార్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తనది చిన్నతనం నుంచి పోరాడేతత్వమని, ప్రజలను భయపెట్టాలని భావించే వ్యక్తులకు వ్యతిరేకంగా తాను పోరాడానన్నారు.

Puvvada Ajay Kumar
Thummala
Khammam District
BRS
Congress
  • Loading...

More Telugu News