TDP: కంటతడి పెట్టిన నారా లోకేశ్.. వీడియో ఇదిగో!

Nara lokesh speech

  • 45 సంవత్సరాలు క్రమశిక్షణతో చంద్రబాబు మనకోసం కష్టపడ్డారన్న లోకేశ్    
  • ప్రజానాయకుడిని 43 రోజులుగా జైలులోనే ఉంచారని ఆవేదన
  • స్కిల్ కేసులో మిగతా వారంతా నెల రోజుల్లో బయటకొచ్చారని గుర్తుచేసిన లోకేశ్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  జ్యుడీషియల్ రిమాండులో వున్న తన తండ్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు పరిస్థితిని తలుచుకుని నారా లోకేశ్ శనివారం కంటతడి పెట్టారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును ప్రభుత్వం కక్షపూరితంగా జైలులో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 45 సంవత్సరాలుగా క్రమశిక్షణతో, పట్టుదలతో మనందరి కోసమే ఆయన పనిచేశారని లోకేశ్ వివరించారు. అలాంటి నేతను 43 రోజులుగా రాజమండ్రి జైలులోనే ఉంచారని చెప్పారు.

ఇది కలలో కూడా ఊహించలేనిదని, తలుచుకుంటేనే దుఃఖం తన్నుకొస్తోందని లోకేశ్ ఆవేదన చెందారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రజానాయకుడిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఆలోచించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, తండ్రి పరిస్థితి గురించి చెబుతూ లోకేశ్ కన్నీటిపర్యంతమయ్యారు. స్కిల్ కేసులో మిగతా వారందరూ 32 రోజుల్లోనో, 38 రోజుల్లోనో బయటకు రాగా చంద్రబాబును మాత్రం జైలులోనే ఉంచేశారంటూ గద్గద స్వరంతో చెప్పారు.

TDP
Andhra Pradesh
Nara Lokesh
Viral Videos
Tweet

More Telugu News