Geetha Madhuri: సింగర్ గీతామాధురితో విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన నందూ

Nadhu gives clarity on news of divorce with Geetha Madhuri
  • ప్రేమ వివాహం చేసుకున్న గీతామాధురి, నందూ
  • మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోతున్నారని వార్తలు
  • ఈ వార్తలను చూసి ఇద్దరం నవ్వుకున్నామన్న నందూ
టాలీవుడ్ గాయని గీతామాధురి, సినీ నటుడు నందూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ప్రచారం జరుగుతోంది. మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోతున్నారని చెపుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లు కూడా విడాకులు తీసుకున్న నేపథ్యంలో, వీరి విడాకుల వార్తల్లో కూడా నిజం ఉండే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. దీనికి తోడు ఈ వార్తలపై ఇద్దరూ స్పందించకపోవడంతో... ఇది నిజం కావచ్చనే భావనలో ఉన్నారు. 

తాజాగా ఈ వార్తలపై నందూ స్పందించాడు. 'మాన్షన్ 24' సినీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నందూ మాట్లాడుతూ... ఈ వార్తల్లో నిజం లేదని చెప్పాడు. ఈ వార్తలను చూసి తామిద్దరం నవ్వుకున్నామని తెలిపాడు. ఇలాంటి వార్తలను తాము పట్టించుకోబోమని అన్నారు. ఎవరో ఏదో రాసినంత మాత్రాన తాము స్పందించాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను ఇప్పుడు స్పందించానని తెలిపాడు. నందూ క్లారిఫికేషన్ తోనైనా ఈ పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి.
Geetha Madhuri
Nandu
Tollywood
Divorce

More Telugu News