Kodandaram: అసెంబ్లీ ఎన్నికలు.. కీలక ప్రకటన చేసిన కోదండరామ్

Kodandaram announces that TJS will work with Congress
  • రాహుల్ గాంధీతో భేటీ అయిన కోదండరామ్
  • బీఆర్ఎస్ ను గద్దె దింపడమే తమ లక్ష్యమని వ్యాఖ్య
  • సీట్ల సర్దుబాటుపై మరోసారి సమావేశమవుతామని వెల్లడి
తెలంగాణ ఉద్యమనేత, టీజేఎస్ పార్టీ అధినేత కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కోదండరామ్ భేటీ అయ్యారు. ఆయనతో చర్చలు జరిపిన తర్వాత కోదండరామ్ ఈ ప్రకటన చేశారు. భేటీ అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ తో చర్చించినట్టు తెలిపారు. సీట్ల సర్దుబాటుపై మరోసారి సమావేశమవుతామని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతామని... ఆ తర్వాత పూర్తి క్లారిటీ వస్తుందని తెలిపారు. అందరి లక్ష్యం కేసీఆర్ ను ఓడించడమేనని అన్నారు.
Kodandaram
Rahul Gandhi
Congress
TJS

More Telugu News