Maha Dharna: టీడీపీ, జనసేన మహాధర్నా.. తీవ్ర ఉద్రిక్తత

TDP and Janasena maha dharna in Avanigadda

  • అవనిగడ్డలో మహా ధర్నాకు పిలుపునిచ్చిన టీడీపీ, జనసేన
  • నియోజకవర్గ అభివృద్ధికి జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ధర్నా
  • ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ, జనసేనలు మహా ధర్నాకు పిలుపునిచ్చాయి. ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు కార్యాలయం ఎదుట ధర్నాకు రావాలంటూ పార్టీ శ్రేణులకు సూచించాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ధర్నా జరగకుండా పెద్ద సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, ధర్నాకు అనుమతులు లేవని పోలీసులు హెచ్చరించారు. 

టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ తో పాటు టీడీపీ, జనసేన నేతలకు నిన్ననే నోటీసులు ఇచ్చారు. బుద్ధ ప్రసాద్ సహా ఇతర నేతలను వారి ఇళ్ల వద్దే నిర్బంధించారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే అన్ని దారుల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఏడాది క్రితం అవనిగడ్డకు వచ్చినప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి రూ. 93 కోట్ల వరాలు కురిపించారని... ఆ హామీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ టీడీపీ, జనసేనలు ధర్నాకు పిలుపునిచ్చాయి.

  • Loading...

More Telugu News