Kodali Nani: కొడాలి నాని ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

Kodali Nani car met with accident

  • కుటుంబంతో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకున్న కొడాలి నాని
  • తిరిగి వస్తుండగా సిమెంట్ బ్యారికేడ్ ను ఢీకొన్న కారు
  •   ప్రమాదం చిన్నది కావడంతో అంతా సేఫ్  

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని వాహనం ప్రమాదానికి గురయింది. ఈ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని తన కుటుంబంతో కలిసి కొడాలి నాని దర్శించుకున్నారు. గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వినాయకుడి గుడి దగ్గర ఉన్న సిమెంట్ బ్యారికేడ్ ను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ఈ కారులోనే ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే ప్రమాదం చిన్నది కావడంతో ఎవరికీ ఏమీ కాలేదు. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. ప్రమాదంలో కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. మరోవైపు ప్రమాదం నేపథ్యంలో వైసీపీ నేతలు నానికి ఫోన్ చేసి ప్రమాదం వివరాలను తెలుసుకుంటున్నారు.

Kodali Nani
Car
Accident
YSRCP
  • Loading...

More Telugu News