Virat Kohli: సచిన్ రికార్డ్‌పై కోహ్లీ గురి.. ఈ వరల్డ్ కప్‌లోనే కొట్టేస్తాడా?

Virat Kohli just 1 century away to break Sachin Tendulkar world record

  • చారిత్రాత్మక రికార్డ్ దిశగా విరాట్ కోహ్లీ
  • వన్డేల్లో 48వ శతకం పూర్తి
  • మరో సెంచరీ చేస్తే సచిన్ సరసన చోటు 
  • 2 సెంచరీలు చేస్తే సచిన్ రికార్డ్ కనుమరుగు

వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో ప్రత్యర్థులను రోహిత్ సేన మట్టికరిపిస్తోంది. గురువారం రాత్రి పూణె వేదికగా బంగ్లాదేశ్‌పై విజయంతో ఈ వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో శతకాన్ని బాదాడు. మొత్తం 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఛేజింగ్‌లో తన సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పాడు.

సిక్సర్‌తో సెంచరీ పూర్తీ చేసిన విరాట్ కోహ్లీ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక రికార్డ్‌కు మరింత చేరువయ్యాడు. బంగ్లాదేశ్‌పై నమోదు చేసిన శతకం కోహ్లీకి వన్డేల్లో 48వది కాగా.. వన్డేల్లో మరో సెంచరీ నమోదు చేస్తే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సరసన చేరతాడు. క్రికెట్ హిస్టరీలో 100 సెంచరీలు పూర్తి చేసిన ఏకైక ఆటగాడు సచిన్ వన్డేల్లో 49 శతకాలు బాదాడు. ప్రస్తుతం 48 సెంచరీలు చేసిన కోహ్లీ మరో 2 శతకాలు కొడితే ఏకంగా సచిన్ రికార్డు బ్రేక్ అవుతుంది. మరి ఆ అరుదైన రికార్డ్ ఈ వరల్డ్ కప్‌తోనే బ్రేక్ అవుతుందా? మరింత సమయం పడుతుందా? అనేది వేచిచూడాల్సిందే.

  • Loading...

More Telugu News