Illegal Affair: గుంటూరు లాడ్జిలో యువతితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కానిస్టేబుల్

Police Constable caught red handed with another woman

  • గుంటూరులో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శ్రీనివాసరావు
  • ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం
  • ఇదే సమయంలో మరో యువతితో వివాహేతర సంబంధం

ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తుంటే వారిని సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఒక పోలీస్ కానిస్టేబుల్ తానే తప్పుడు మార్గంలోకి వెళ్లాడు. ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరులో శ్రీనివాసరావు అనే వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. ఇదే సమయంలో మరో యువతితో కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసిపోయింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. 

తాజాగా గుంటూరులో ఓ లాడ్జిలో సదరు యువతితో శ్రీనివాసరావు ఉండగా ఆయన భార్య, బంధువులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడి నుంచే పోలీసులకు వారు సమాచారం అందించారు. దీంతో, లాడ్జికి చేరుకున్న పోలీసులు ఆయనను, యువతిని అక్కడికక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Illegal Affair
Police
Constable
Guntur
  • Loading...

More Telugu News