Stock Market: అంతర్జాతీయ ప్రతికూలతలు.. వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 247 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 46 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతం వరకు పతనమైన విప్రో షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని ప్రదర్శించాయి. మధ్యమధ్యలో కొంత కొనుగోళ్ల అండ లభించినప్పటికీ లాభాల్లోకి మాత్రం వెళ్లలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 65,629కి పడిపోయింది. నిఫ్టీ 46 పాయింట్లు కోల్పోయి 19,624కి దిగజారింది.
నెస్లే ఇండియా (3.66%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.83%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.08%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.37%), ఎల్ అండ్ టీ (0.24%).
విప్రో (-2.99%), టెక్ మహీంద్రా (-1.29%), ఎన్టీపీసీ (-1.10%), సన్ ఫార్మా (-1.06%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.05%).