Manchu Lakshmi: స్వలింగ వివాహాలపై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

Manchu Lakshmi sensational comments on Supreme Court verdict on Same Sex Marriages

  • స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమన్న సుప్రీంకోర్టు
  • సుప్రీంకోర్టు నిర్ణయంతో తన గుండె పగిలిపోయిందన్న మంచు లక్ష్మి
  • మన దేశానికి ఇది అవమానకరమని వ్యాఖ్య

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో తన గుండె పగిలిపోయిందని ఆమె చెప్పింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు చెప్పడం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని తెలిపింది. మిగిలిన ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన మన దేశానికి ఇది నిజంగా అవమానమని చెప్పింది. ఇతర దేశాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నారని... మన దేశంలో వీరి వివాహాలను అంగీకరించలేమా? అని ప్రశ్నించారు. 

More Telugu News