Chandrababu: ఈరోజు ఏసీబీ కోర్టు ముందు హాజరుకానున్న చంద్రబాబు

Chandrababu to attend ACB Court virtually today
  • గత 41 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు
  • ఈరోజుతో ముగియనున్న రిమాండ్ గడువు
  • వర్చువల్ గా బాబును కోర్టులో ప్రవేశ పెట్టనున్న అధికారులు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత 41 రోజులుగా ఆయన జైల్లో ఉంటున్నారు. ఈరోజుతో ఆయన జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయనను వర్చువల్ గా అధికారులు హాజరుపరచనున్నారు. మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
Chandrababu
Telugudesam
ACB Court
AP High Court
Bail

More Telugu News