Rizwan: మైదానంలో నమాజ్ చేయాలని రిజ్వాన్ ను ఎవరు కోరారు?: పాక్ మాజీ క్రికెటర్
- భారత్ పై విమర్శలను తప్పుబట్టిన పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా
- ఎదుటి వారి లోపాలు ఎంచడం కాదంటూ హితవు
- తమ వైపు లోపాలను సరి చేసుకోవాలని పీసీబీకి సూచన
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) వ్యవహార శైలిని పాక్ మాజీ క్రికెటర్ అయిన డానిష్ కనేరియా తప్పుబట్టాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ నెల 14న భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ బృందం పట్ల ప్రేక్షకులు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదంటూ పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై కనేరియా మండిపడ్డాడు. పీసీబీ ఇతరుల వైపు తప్పులు ఎంచుతోందే కానీ, తన వైపు లోపాలను గుర్తించడం లేదని విమర్శించాడు.