Pepper X: ప్రపంచంలో అత్యంత మంట పుట్టించే మిరపకాయ ఇదే..!
- అత్యంత కారం, వేడిని పుట్టించే పెప్పర్ ఎక్స్
- గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
- 2.69 మిలియన్ స్కోవిల్లే హీట్ యూనిట్ల నమోదు
- తిన్న తర్వాత మూడున్నర గంటల పాటు మంట
ప్రపంచంలో అత్యంత కారంతో కూడిన మిరపకాయగా కొత్త రకం తెరపైకి వచ్చింది. పెప్పర్ ఎక్స్ పేరుతో వింత ఆకారంలో ఉండే ఈ మిరపను ‘వరల్డ్ హాటెస్ట్ పెప్పర్’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న కరోలినా రీపర్ రకాన్ని వెనక్కి నెట్టేసింది. పెప్పర్ ఎక్స్ 2.69 మిలియన్ స్కోవిల్లే హీట్ యూనిట్లను నమోదు చేసింది. కరోలినా రీపర్ రకం మిరపలో స్కోవిల్లూ హీట్ యూనిట్లు 1.64 మిలియన్ యూనిట్లుగా కావడం గమనించొచ్చు.