Ramcharan: కూతురు క్లీంకారతో కలిసి తొలి విదేశీ ట్రిప్ కు బయల్దేరిన రామ్ చరణ్ దంపతులు

Ram charan and Upasana leaves to Italy with Klinkaara

  • ఇటలీ టూర్ కు బయల్దేరిన చరణ్
  • చరణ్ చేతిలో పెట్ డాగ్ రైమ్
  • ఉపాసన ఒడిలో క్లీంకార 

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫారిన్ ట్రిప్ కు బయల్దేరాడు. బిజీ షూటింగ్ షెడ్యూల్ లో కూడా కుటుంబం కోసం కాస్త సమయాన్ని తీసుకుని ఇటలీకి పయనమయ్యాడు. ఈ ట్రిప్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది తన ముద్దుల తనయ క్లీంకారకు తొలి ఫారిన్ ట్రిప్ కావడం గమనార్హం. విమానాశ్రయంలో వారు వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ చేతుల్లో వారి పెట్ డాగ్ రైమ్, ఉపాసన ఒడిలో క్లీంకార ఉన్నారు. ఫొటోల్లో చరణ్, ఉపాసన ఇద్దరూ క్యాజువల్ లుక్ లో ఉన్నారు. అయితే తమ కూతురు ముఖాన్ని మాత్రం కెమెరాలకు ఉపాసన చూపించలేదు.

Ramcharan
upasana
Italy
Tollywood
Klinkaara
  • Loading...

More Telugu News