Chatrapathi movie: 23న థియేటర్ల ముందుకు ‘ఛత్రపతి’
![Prabhas super hit Chatrapathi locks its re release](https://imgd.ap7am.com/thumbnail/cr-20231018tn652f6e2868300.jpg)
- ప్రభాస్ పుట్టిన రోజు నాడు ముహూర్తం
- దేశవ్యాప్తంగా 4కే వెర్షన్ లో విడుదల
- 2005లో విడుదలై సూపర్ హిట్ చూసిన సినిమా
ప్రభాస్, శ్రియా శరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ మరో సారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీన్ని ఈ నెల 23న దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రాజమౌళి తీసిన ఈ సినిమా 2005లో విడుదలై సూపర్ హిట్ కావడం ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ సినిమాను మరోసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ప్రభాస్ కు ఈ సినిమాతో మంచి గుర్తింపు రావడం తెలిసిందే.