Bigg Boss 7: 'బిగ్ బాస్ 7'లో రచ్చ రచ్చ .. భోలే షావలిపై ప్రియాంక - శోభ ఫైర్!

Bigg Boss 7 Update

  • వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన 'భోలే షావలి'
  • అతణ్ణి నామినేట్ చేసిన శోభ
  • ఆమె తీరు పట్ల అతని అసహనం 
  • ఆయన ధోరణి పట్ల మండిపడిన ప్రియాంక 
  • హౌస్ లో వేడివేడిగా ఉన్న వాతావరణం

'బిగ్ బాస్ సీజన్ 7' మొదలైపోయి అప్పుడే 40 రోజులు దాటిపోయింది. ఈ 40 రోజుల్లో హౌస్ లో నుంచి చాలామంది బయటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది 'వైల్డ్ కార్డు' ఎంట్రీ ఇచ్చారు. వాళ్లలో ఒకరుగా సంగీత దర్శకుడు 'భోలే షావలి' కూడా ఉన్నాడు. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా నిన్న పెద్ద రచ్చనే జరిగింది.

'భోలే షావలి' ముందున్న 'కుండ' పగలగొట్టి అతణ్ణి నామినేట్ చేయడానికి శోభ సిద్ధపడింది. అయితే అందుకు ఆమె చెప్పిన రీజన్ పట్ల అతను అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. 'బిగ్ బాస్' హౌస్ లో 'మోనిత'ను చూస్తున్నట్టుగా ఉందని, గతంలో ఆమె ఒక సీరియల్లో పోషించిన పాత్రను ఉద్దేశించి భోలే షావలి మాట్లాడాడు. దాంతో తనకి గుర్తింపు తెచ్చిందే ఆ పాత్ర అంటూ శోభ ఫైర్ అయింది. 

ఒకరినొకరు ఎద్దేవా చేసుకుంటూ చాలా దూరం వెళ్లారు. 'నీకు సెన్స్ లేదు' అని శోభా అంటే, 'నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలి' అని అతను అన్నాడు. ఆ సమయంలో అతను ఒక బూతు మాట అనడంతో, అలా మాట్లాడటం కరెక్టు కాదంటూ ప్రియాంక ముందుకు వచ్చింది. దాంతో ఆమెతోను భోలే షావలి వాదనకి దిగాడు. ఆ తరువాత అతను సారీ చెప్పడానికి ట్రై చేసినా, అందుకు వారు నిరాకరించడం నిన్న జరిగిన ఎపిసోడ్ హైలైట్ గా చెప్పుకోవాలి. 

Bigg Boss 7
Bhole Shavali
Sobha
priyanka
  • Loading...

More Telugu News