Bhagavanth Kesari: డైరెక్టర్ ప్లేస్ లో ఎవరున్నా నేను ఇంతే: 'అన్ స్టాపబుల్ 3'లో బాలయ్య

Unstoppable 3 talk show update

  • 'ఆహా'లో మొదలైన 'అన్ స్టాపబుల్ 3'
  • 'భగవంత్ కేసరి' టీమ్ తో మొదలైన సందడి 
  • డైరెక్టర్ తనకి గురువుతో సమానమన్న బాలయ్య 
  • స్టేజ్ పై స్టెప్పులతో హుషారెత్తించిన తీరు

బాలకృష్ణ వ్యాఖ్యాతగా నిన్న 'ఆహా' వేదికపై 'అన్ స్టాపబుల్ 3' టాక్ షో మొదలైపోయింది. బాలయ్య హీరోగా చేసిన 'భగవంత్ కేసరి' టీమ్ తో ఈ సీజన్ ఫస్టు ఎపిసోడ్ మొదలుకావడాన్ని విశేషంగానే చెప్పాలి. ఈ స్టేజ్ పై పింక్ కలర్ డ్రెస్ లో బాలయ్య చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. ఈ ఎపిసోడ్ లో పాల్గొన్న కాజల్ .. శ్రీలీల .. అనిల్ రావిపూడిలను తనదైన స్టైల్లో ఆటపట్టించారు. 

తాను ఇంతవరకూ చేసిన సినిమాలు చాలా తక్కువనీ, అలాంటిది 100 సినిమాలకిపైగా చేసిన బాలకృష్ణగారు, షూటింగు సమయంలో తనని గురువుగారు అంటూ పిలిచేవారని అనిల్ రావిపూడి అన్నారు. ఆయనలాంటి ఒక సీనియర్ స్టార్ హీరో అలా పిలవడం తనకి చాలా ఇబ్బందిని కలిగించేదని చెప్పారు. 

అప్పుడు బాలకృష్ణ స్పందిస్తూ .. "డైరెక్టర్ చైర్లో ఎవరు కూర్చున్నా, మా నాన్నతో సమానంగా భావిస్తాను .. నా గురువుగా గౌరవిస్తాను. ఆ సంస్కారం నాకు మా నాన్నగారి నుంచి వచ్చిందే" అని అన్నారు. ఆడపిల్లను లేడి పిల్లలా కాదు, పులిపిల్లలా పెంచాలనే సందేశం ఉన్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పారు. ఈ సినిమాలో గణపతి ఉత్సవాల్లో భాగంగా వచ్చే పాటకి, కాజల్ .. శ్రీలీలతో కలిసి బాలయ్య స్టెప్పులేయడం విశేషం.

Bhagavanth Kesari
Balakrishna
Anil Ravipudi
Sreeleela
Kajal Agarwal
  • Loading...

More Telugu News