Bhagavanth Kesari: బాలయ్య కూతురుగా శ్రీలీలను అడగడానికి కారణమిదే: అనిల్ రావిపూడి

Bhagavanth Kesari Movie Update

  • ఈ నెల 19న వస్తున్న 'భగవంత్ కేసరి'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ 
  • శ్రీలీలపై నమ్మకం ఉందన్న అనిల్ రావిపూడి
  • ఆమెను బాలయ్య అభినందించారని వెల్లడి

బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన 'భగవంత్ కేసరి' ఈ నెల 19వ తేదీన థియేటర్లకు రానుంది. కాజల్ - శ్రీలీల ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా అర్జున్ రాంపాల్ కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

"మొదటి నుంచి కూడా ఒక్కో జోనర్ ను టచ్ చేస్తూ వచ్చాను. కంటెంట్ పరంగా నా మార్క్ ను టచ్ చేస్తూనే, కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నాను. అలాంటి సమయంలో బాలకృష్ణగారు నాకు ఛాన్స్ ఇచ్చారు. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి నాకు దొరికిన ఒక మంచి అవకాశం ఇది" అని అన్నారు. 

"ఈ సినిమా ఒప్పుకునే సమయానికి శ్రీలీల ఒక్క సినిమానే చేసింది. అందువలన కూతురు పాత్రకి అడగడానికి మేము, చేయడానికి ఆమె పెద్దగా ఆలోచన చేయలేదు. ఆ తరువాత ఆమెకి వరుస అవకాశాలు వచ్చాయి .. ఫాలోయింగ్ పెరిగింది. ఒక రకంగా మా సినిమాకి అది ప్లస్ అవుతుంది. శ్రీలీల చాలా బాగా చేసిందని బాలయ్య అన్నారు. తను బాగా చేస్తుందన్న నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది" అని చెప్పారు. 

Bhagavanth Kesari
Balakrishna
Sreeleela
Anil Ravipudi
  • Loading...

More Telugu News