Revanth Reddy: కాంగ్రెస్ నేతలు కష్టపడితే... ఆ నీళ్లను జగన్ రెడ్డి తీసుకుపోయారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy public meeting in vikarabad

  • పాలమూరు-రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్రశ్న
  • ఎంఎంటీఎస్ రైలు తీసుకు వచ్చేందుకు జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్న రేవంత్ రెడ్డి
  • కృష్ణా జలాలు, ఎంఎంటీఎస్ రాకపోవడానికి కేసీఆర్ కారణమని ఆరోపణ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతో కష్టపడి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేయిస్తే, ఆ నీళ్లను జగన్ రెడ్డి తీసుసుకుపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్‌లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... పాలమూరు - రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని నిలదీశారు. వికారాబాద్‌కు కృష్ణా జలాలు రాకపోవడానికి కారణం ఎవరన్నారు. ఎంఎంటీఎస్ రైలు వికారాబాద్ వరకు తీసుకు రావడానికి జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు.

అయినప్పటికి ఇప్పటికీ వికారాబాద్‌కు కృష్ణా జలాలు, ఎంఎంటీఎస్ రైలు రాకపోవడానికి కారణం కేసీఆర్ అని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలకు రాజకీయాల్లో తెలియని రౌడీయిజాన్ని కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు మంజూరు చేయిస్తే నీళ్లను జగన్ రెడ్డి తీసుకు పోయారన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగుల ప్రాణాలు హరిస్తోందన్నారు. ఉద్యోగ పరీక్ష జరగలేదనే బెంగతో ఇటీవలే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. తెలంగాణ దశ, దిశ మారాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నారు.

  • Loading...

More Telugu News