Tiger Nageshwara Rao: రేణుదేశాయ్ గారూ .. మీ అబ్బాయిని హీరోను చేయాలి: విజయేంద్ర ప్రసాద్

Tiger Nageshwara Rao Pre Release Event

  • హైదరాబాదులో 'టైగర్ నాగేశ్వరావు' ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ముఖ్య అతిథిగా వచ్చిన విజయేంద్ర ప్రసాద్
  • అకీరా ఎంట్రీ గురించి వచ్చిన ప్రస్తావన
  • ఈ దసరా 'టైగర్'దే నంటూ వ్యాఖ్య


రవితేజ - వంశీ కాంబినేషన్లో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఈ నెల 20వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంటుకు విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ .. "గతంలో మణిరత్నం గారి 'నాయకుడు' వంటి సినిమా చూస్తూ, ఇలాంటి సినిమాలు తెలుగులో ఎప్పుడు వస్తాయా అనుకునేవాడిని .. అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది" అంటూ ఆడిటోరియంను హూషారెత్తించారు. 

'పుష్ప' తరువాత ట్రైలర్ తోనే నన్ను కథలోకి .. ఆ కాలంలో తీసుకెళ్లిన సినిమా ఇది. ట్రైలర్ చూడగానే డైరెక్టర్ కి కాల్ చేసి అభినందించాను. రేణు దేశాయ్ గారు తెలుగు సినిమాలు చేయకపోయినా, తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నారు. ఆమె వాళ్ల అబ్బాయిని హీరోగా చేయాలి .. సినిమాలో అతని తల్లి పాత్రను ఆమెనే చేయాలనేదే నా మాట" అనడంతో ఒక్కసారిగా అక్కడ సందడి పెరిగిపోయింది. 

"రవితేజ టాలెంట్ గురించి నాకు తెలుసు. భారతదేశమంతా ఆయన తన కీర్తి పతాకాన్ని ఎగరేయాలని కోరుకుంటున్నాను. వచ్చేది దసరా .. దుర్గమ్మవారికి ఎదురుగా ఎవరూ నిలబడలేరు .. ఆ తల్లి వాహనమైన 'టైగర్' ముందు కూడా ఎవరూ ఎదురుగా నిలబడలేరు. ఈ దసరా నీదే .. నీదే" అని అన్నారు. 

Tiger Nageshwara Rao
Raviteja
Nupur Sanon
Renu Desai
  • Loading...

More Telugu News