Renu Desai: రవితేజ గారు తీసుకున్న ఆ నిర్ణయం నాకు చాలా ఇంపార్టెంట్: 'టైగర్ నాగేశ్వరరావు' ఈవెంటులో రేణు దేశాయ్

Tiger Nageshwara Rao Pre Release Event

  • టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ 
  • ఈ నెల 20వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా 
  • ముఖ్యమైన పాత్రను పోషించిన రేణు దేశాయ్ 
  • ఈ సినిమా తనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన రేణు దేశాయ్ 


రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా రూపొందింది. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమా, దసరా కానుకగా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ - 'శిల్పకళావేదిక'లో నిర్వహించారు.

ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన రేణు దేశాయ్ మాట్లాడుతూ .. "నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు అయింది. అయినా 'బద్రీ' ఈ మధ్యనే రిలీజ్ అయిందనే ఫీలింగ్ వస్తోంది. ఇంతకాలంగా నేను తెలుగు సినిమాలు చేయకపోయినా, మీరంతా అదే ప్రేమను చూపిస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతూ వచ్చారు .. మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను" అన్నారు. 

"ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. రవితేజగారి వంటి సీనియర్ స్టార్ తో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయనకి తెలియదు. ఈ వేదిక ద్వారా .. పర్సనల్ గాను రవితేజగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. అంతా కూడా ఈ నెల 20వ తేదీన థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను" అని చెప్పారు.

Renu Desai
Raviteja
Nupur Sanon
Tiger Nageshwara
  • Loading...

More Telugu News