Hai Nanna: మేం ముందే వస్తున్నాం... 'హాయ్ నాన్న' రిలీజ్ డేట్ వెల్లడించిన నాని

Nani announced Hai Nanna release date

  • నాని, బేబీ కియారా, మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం 'హాయ్ నాన్న'
  • దర్శకుడిగా పరిచయం అవుతున్న శౌర్యువ్
  • నేడు టీజర్ విడుదల
  • డిసెంబరు 7న 'హాయ్' నాన్న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు నాని వెల్లడి

నేచురల్ స్టార్ నాని, బేబీ కియారా ఖన్నా, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'హాయ్ నాన్న'. తండ్రి కుమార్తె సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకుడు. కాగా, నేడు ఈ చిత్రం నుంచి అధికారిక టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఈ టీజర్ ను పంచుకుంది. అంతేకాదు, మేం ముందే వచ్చేస్తున్నాం అంటూ నాని 'హాయ్ నాన్న' రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశాడు. డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు వెల్లడించాడు. "ఈ సంవత్సరాన్ని ప్రేమతో ముగించాల్సిన అవసరం ఉంది... ఆ ప్రేమను మేం అందిస్తాం" అంటూ నాని అందంగా వివరించాడు.

More Telugu News