Suhasini: హీరోయిన్ గా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా: సుహాసిని

I also faced faced issues when I was heroine says Suhasini
  • అసభ్యకరమైన సన్నివేశాలను  తిరస్కరించేదాన్నని చెప్పిన సుహాసిని
  • హీరో ఒడిలో కూర్చునే సీన్ చేయనని చెప్పానని వెల్లడి
  • అదే సినిమాలో హీరో ఎంగిలి చేసిన ఐస్ క్రీమ్ తినాలని చెప్పారన్న సీనియర్ నటి
సుహాసిని అనగానే మనకు ఒక హోమ్లీ హీరోయిన్ గుర్తుకొస్తారు. హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె.. ఏరోజు కూడా గ్లామర్ షో చేయలేదు. వస్త్రధారణ విషయంలో కూడా ఆమె ఏనాడూ హద్దులు దాటలేదు. అయితే హీరోయిన్ గా చేసేటప్పుడు తాను చాలా ఇబ్బందులు పడ్డానని ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే తాను తిరస్కరించేదాన్నని చెప్పారు. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉందని... అయితే పరాయి వ్యక్తి ఒడిలో కూర్చునే సీన్ కాబట్టి ఆ సీన్ ను తాను చేయనని చెప్పానని తెలిపారు. 

అదే సినిమాలో హీరోతో కలిసి ఐస్ క్రీమ్ తినే సీన్ ఉందని... హీరో తిన్న ఐస్ క్రీమ్ నే తినాలని తనకు చెప్పారని... వేరే వాళ్లు తిన్న ఐస్ క్రీమ్ ను తాను తినడం ఏమిటని సీరియస్ అయ్యానని చెప్పారు. అయితే తాను చెప్పిన విధంగా చేయాలని కొరియోగ్రాఫర్ తనపై సీరియస్ అయ్యాడని... అయినా తాను అంగీకరించలేదని... ఎంగిలి ఐస్ క్రీమ్ తినడం కాదు, కనీసం ముట్టుకోనని చెప్పానని... దీంతో ఐస్ క్రీమ్ మార్చారని తెలిపారు.
Suhasini
Tollywood

More Telugu News