Hrithik Roshan: ముంబై మెట్రోలో నటుడు హృతిక్ రోషన్ ప్రయాణం.. ఫొటోలు ఇవిగో!

- ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు మెట్రోను ఆశ్రయించిన హృతిక్
- హృతిక్‌తో సెల్ఫీలకు ప్రయాణికుల ఉత్సాహం
- వారి అభిమానం చూసి ముగ్ధుడినయ్యానంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్
ట్రాఫిక్ కష్టాలు తప్పించుకునేందుకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా ముంబై మెట్రోలో ప్రయాణించారు. అంతటి నటుడు మెట్రోలో ప్రయాణిస్తారని ఊహించని ప్రయాణికులు హృతిక్‌ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనేక మంది ఆయనతో సెల్ఫీలు కూడా దిగేందుకు ఉత్సాహం చూపించారు. అభిమానులతో దిగిన ఫొటోలను హృతిక్ నెట్టింట షేర్ చేశారు.

