Somireddy Chandra Mohan Reddy: శిశుపాలుడివి వంద తప్పులు..జగన్‌వి వెయ్యి తప్పులు: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

TDP leader Somireddy warns Jagan Sajjala and Amarnath

  • సజ్జల, మంత్రి అమర్నాథ్‌పై సోమిరెడ్డి ఆగ్రహం
  • మీలాగా మా నాయకుడికి ఫ్యాక్షన్ చరిత్ర లేదన్న టీడీపీ నేత
  • ఎన్ని కుటుంబాలను అనాథలుగా మార్చారో అందరికీ తెలుసన్న వైనం
  • అక్రమ కేసులతో చంద్రబాబును జైలులో పెట్టి ఎంజాయ్ చేస్తున్నారని మండిపాటు
  • మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడని హెచ్చరిక

శిశుపాలుడు వంద తప్పులు చేస్తే జగన్ వెయ్యి తప్పులు చేశారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అమర్నాథ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్‌పై సజ్జల చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని అన్నారు. ఓ మాజీ సీఎం గురించి ఎలా మాట్లాడాలో వైసీపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. మీలాగా చిన్నాన్నను గొడ్డలితో లేపేసి బయట ఉండాలా? అని ప్రశ్నించారు. మీ ఫ్యాక్షన్ చరిత్ర ఏంటో అందరికీ తెలుసని, ఎన్ని ప్రాణాలు తీసి, ఎన్ని కుటుంబాలను అనాథలుగా మార్చారో అందరికీ తెలుసని అన్నారు. మీలాంటి రక్త చరిత్ర తమ నాయకుడికి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జగన్‌పై సానుభూతి పెరిగేందుకు విశాఖలో శ్రీనివాసరావు అనే వ్యక్తి భుజంపై గుచ్చితే చుక్క రక్తం మాత్రమే వచ్చిందని, దీంతో రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని ఎన్ఐఏతో విచారణ చేయించాలని అడిగారని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఎన్ఐఏ విచారణ అవసరం లేదంటూ శ్రీనివాస్‌ను నాలుగున్నరేళ్లగా జైలులో ఉంచారని మండిపడ్డారు. మీరు బయట ఉండి ప్రజల్ని దోచుకుంటున్నారని, నాసిరకం మద్యంతో ప్రజల్ని చంపుతున్నారని ఆరోపించారు. మీకసలు సంస్కారం ఉందా? అని ప్రశ్నించారు. 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని అక్రమ కేసులతో జైలులో పెట్టి ఎంజాయ్ చేస్తున్నారని, మీ తప్పులను భగవంతుడు క్షమించడని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Somireddy Chandra Mohan Reddy
Sajjala Ramakrishna Reddy
Gudivada Amarnath
Telugudesam
  • Loading...

More Telugu News