Sujana Chowdary: వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని నడ్డా సూచించారు: సుజనా చౌదరి

Sujana Choudhary talks about ap politics with jp nadda
  • ఆంధ్రప్రదేశ్ అంశాలు నడ్డాతో చర్చించినట్లు చెప్పిన సుజనా చౌదరి
  • చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారాన్ని తిప్పికొట్టాలని నడ్డా సూచించినట్లు వెల్లడి
  • వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్న సుజనా
ఏపీ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తమ పార్టీ అధ్యక్షుడు నడ్డా చెప్పినట్టు బీజేపీ నేత సుజనా చౌదరి పేర్కొన్నారు. నేడు జేపీ నడ్డాతో సుజనా భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందన్న వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టేలా బీజేపీ కార్యాచరణ ఉండాలని నడ్డా దిశానిర్దేశం చేసినట్టు ఆయన తెలిపారు. ఏపీలో రాజకీయ పరిణామాలపై జేపీ నడ్డాతో చర్చించినట్లు చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా అధినేతతో చర్చించామన్నారు.
Sujana Chowdary
Chandrababu
JP Nadda
BJP

More Telugu News